NDL: వెలుగోడు మండలం వేల్పనూరులో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ఇవాళ 76 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి కింద మంజూరైన రూ. 53 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సాయం అందిస్తున్నట్లు తెలిపారు. పేద కుటుంబాలకు ఈ నిధి ఎంతో భరోసానిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పేదలకు సీఎం సహాయనిధి ఒక వరం: ఎమ్మెల్యే


