హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సామర్లకోట అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే పరిశీలన

KKD: సామర్లకోట పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మంగళవారం పరిశీలించారు. నీలం చెరువు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు బల్ల మార్కెట్ సెంటర్‌లోని కాపు కళ్యాణ మండపం నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లు, అధికారులకు సూచించారు.