హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా మురళి సార్

SDPT: జగదేవ్‌పూర్ మండలంలోని మందాపూర్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి సార్ సిద్దిపేట జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కావడం పట్ల పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల, గ్రామం తరఫున మురళి సార్‌ను శాలువాతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. విద్యార్థుల అభ్యున్నతికి ఆయన చేస్తున్న సేవలను కొనియాడారు.