కృష్ణా: ఆర్టీసీలో ప్రవేశపెడుతున్న విద్యుత్ బస్సులను ఆర్టీసీ ద్వారానే నడపాలని డిమాండ్ చేస్తూ, సీఐటీయూ ఆధ్వర్యంలో గుడివాడ ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఇవాళ ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రయత్నాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. బస్సుల నిర్వహణను ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తున్నారని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
ఆర్టీసీ ప్రైవేటీకరణ వెంటనే నిలిపివేయాలి: CITU


