హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: డ్రైనేజీలో వ్యర్ధాలను తొలగించాలి..!

కృష్ణా: మోపిదేవి తూర్పు హరిజనవాడ వద్ద డ్రైనేజీలో వ్యర్ధాలను తొలగించాలని గ్రామస్థులు కోరుతున్నారు. డ్రైనేజీలో నీరు రాకపోకలు లేక వ్యర్ధాలు కుళ్లిపోయి అంటు రోగాలు వచ్చే అవకాశం ఉందని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. డ్రైనేజీ నీరు రోడ్లపైకి చేరి వాహనదారులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంచాయతీ అధికారులు స్పందించి డ్రైనేజీలో వ్యర్ధాలు తొలగించాలని కోరుతున్నారు.