హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆదోనిలో ఎంఎస్పీ, ఎమ్మార్పీఎస్ కమిటీలు ఎన్నిక

KRNL: ఆదోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్లో ఇవాళ ఎంఎస్పీ, ఎమ్మార్పీఎస్ నూతన కమిటీలను ఎన్నుకున్నారు. ఎంఎస్పీ నియోజకవర్గ అధ్యక్షుడిగా గుమ్మల బాలస్వామి, ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ అధ్యక్షుడిగా వన్నెల మణికంఠ ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన నాయకులను సీనియర్ నాయకులు సన్మానించారు. ఎమ్మార్పీఎస్ ఎజెండా, విధివిధానాలను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు.