హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పత్తి పంటపై వర్షాల ప్రభావం.. తగ్గిన దిగుబడి

NTR: వీరులపాడు మండలం నరసింహారావుపాలెంలో పత్తి పంట చేతికి వచ్చింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో క్వింటా పత్తి ధర రూ.8 వేల వరకు ఉందని రైతులు తెలిపారు. అయితే తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా మొక్కల ఎదుగుదల లోపించిందని, వచ్చిన కాయలన్నీ పక్వానికి వచ్చినా ఈ ఏడాది దిగుబడి భారీగా తగ్గే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.