KNR: శంకరపట్నంమండలంలోని ముత్తారం గ్రామ రామసముద్రం చెరువు భారీ వర్షాలతో నిండిపోయి మత్తడి దూకుతోంది. దీంతో చెరువు అందాలను వీక్షించేందుకు స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలివచ్చారు. చెరువులో నీరు సమృద్ధిగా చేరడంతో రానున్న రోజుల్లో తాగు, సాగునీటికి ఇబ్బందులు ఉండవని రైతులు హర్షం వ్యక్తం చేశారు. మత్స్యకారులకు కూడా మేలు జరుగుతుందని తెలిపారు.
తెలంగాణ
రామసముద్రం చెరువుకు జలకళ


