హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలి'

KNR: చిగురుమామిడి మండలం గునుకులపల్లె గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమరవీరుల స్థూపాల వద్ద సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి జెండా ఆవిష్కరించి నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుల త్యాగాలు, పోరాట స్ఫూర్తిని నేటి తరానికి తెలియజేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.