హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి!

NZB: భీమగల్‌లో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. భీమగల్ నుంచి బాబాపూర్ వైపు ఇద్దరు స్నేహితులు బైక్‌పై వెళ్తుండగా వాహనం అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.