హైదరాబాద్: 28°C
తెలంగాణ

బారికేడ్లు లేక ప్రమాదాలపై ఆందోళన

భద్రాద్రి: భద్రాచలం పొట్టి శ్రీరాములు సెంటర్‌లో ట్రాఫిక్‌ భద్రతపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రహదారిపై వాహనాల రాకపోకలకు నియంత్రణ లేకపోవడంతో ప్రమాదాల ముప్పు ఉందని చెబుతున్నారు. గతంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను తిరిగి అమర్చి, వాహనాల వేగాన్ని నియంత్రించే చర్యలు చేపట్టాలని అధికారులను కోరుతున్నారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.