SRPT: అనంతగిరి మండలం బొజ్జగూడెం తండ గ్రామంలో ఇవాళ పచ్చదనం-పారిశుధ్య కార్యక్రమం ఆరో రోజు కొనసాగింది. సర్పంచ్ నీలాబాయి ఆధ్వర్యంలో గ్రామంలోని పిచ్చి మొక్కలను తొలగించి, డ్రైనేజీలను శుభ్రం చేశారు. అనంతరం పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు బ్లీచింగ్ పౌడర్ చల్లారు. గ్రామాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో ఉంచేందుకు నిరంతరం చర్యలు చేపడుతున్నట్లు సర్పంచ్ తెలిపారు.
తెలంగాణ
బొజ్జగూడెం తండలో పచ్చదనం–పారిశుధ్య కార్యక్రమం


