హైదరాబాద్: 28°C
తెలంగాణ

వర్షాలతో మున్నేరులో పెరిగిన వరద

ఖమ్మం ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు మున్నేరు నదిలో నీటి ప్రవాహం గణనీయంగా పెరిగింది. చవితి సందర్భంగా నగర పరిసరాల్లోని 300కు పైగా గణేశ్ విగ్రహాలను మున్నేరులో నిమజ్జనం చేయడం ఆనవాయితీ. కొంతకాలంగా నీటి కొరతతో నిమజ్జనంపై సందేహాలు ఉండగా, ప్రస్తుతం ప్రవాహం పెరగడంతో నిర్వాహకులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.