హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినాయకుడిని దర్శించుకున్న బోథ్ MLA అనిల్ జాదవ్

ADB: నేరడిగొండ మండలంలోని రాజుర గ్రామంలో గల వినాయకుడిని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గణేష్ మండలి సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులున్నారు.