హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొత్తకొండలో రక్తవర్ణ గణపతి అలంకరణ

HNK: కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో వినాయక చవితి వేడుకల్లో భాగంగా రెండో రోజు మంగళవారం రక్తవర్ణ గణపతి అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోని వివిధ మండపాల్లో ప్రతిష్ఠించిన గణనాథులకు ఉదయాన్నే భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. విఘ్నాలను తొలగించి విజయాలను అందించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని భక్తులు ఆకాంక్షించారు.