హైదరాబాద్: 28°C
తెలంగాణ

లండన్‌లో అంబేద్కర్ జ్ఞాపకాలను స్మరించిన ఎమ్మెల్యేలు

MBNR: లండన్‌లో డా. బి.ఆర్. అంబేద్కర్ 1921–22లో నివసించిన చారిత్రక గృహాన్ని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. అంబేద్కర్ జీవితానికి సంబంధించిన ఫొటోలు, పత్రాలు, వ్యక్తిగత వస్తువులను పరిశీలించారు. సామాజిక సమానత్వం, న్యాయం కోసం ఆయన చూపిన మార్గం స్ఫూర్తిదాయకమన్నారు.