హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రమాదకరంగా చిన్నచింతరేవుల-ధరూర్ దారి

గద్వాల: చిన్నచింతరేవుల నుంచి మన్నపురం మీదుగా ధరూర్‌కు వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. రోడ్డుపై కంకర తేలడంతో పాటు నీరు పారుతుండటంతో వాహనదారులు జారి కిందపడుతున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీసీ లేదా బీటీ రోడ్డు వేయాలని వాహనదారులు, స్థానికులు అధికారులను కోరుతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.