హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాగార్జునసాగర్ నీటిమట్టం వివరాలు

NLG: శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం 5,492 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉందని ప్రాజెక్ట్ అధికారులు ఇవాళ తెలిపారు. 12,478 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామన్నారు. కుడి కాలువకు నీటి విడుదలను నిలిపివేసి, ఎడమ కాలువకు 7,190 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.