హైదరాబాద్: 28°C
తెలంగాణ

భవనం పై నుంచి పడి పెయింటర్ మృతి

MDK: తూప్రాన్ పట్టణంలో భవనం పైనుంచి పడి పెయింటర్ సంజయ్ (31) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సంజయ్ తూప్రాన్ పట్టణంలో పెయింటింగ్ పనులు చేసేందుకు వచ్చాడు. పెయింటింగ్ పనులు నిర్వహిస్తున్న భవనం పైనుంచి సోమవారం అర్ధరాత్రి కింద పడి మృతి చెందినట్లు వివరించారు. సంజయ్ మృతికి ఇంకా కారణాలు తెలియ రాలేదు.