హైదరాబాద్: 28°C
తెలంగాణ

పుష్కర ఘాట్ అభివృద్ధి పనులకు మంత్రి భూమి పూజ

MNCL: చెన్నూరు పట్టణంలోని పుష్కర ఘాట్‌ను కార్మిక శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి మంగళవారం సందర్శించారు. ఈ సందర్బంగా పుష్కర ఘాట్ అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించారు. రాబోయే పుష్కరాలను పురస్కరించుకొని పుష్కర ఘాట్ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.