హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అధికారుల పర్యవేక్షణ లేమితో శిథిలావస్థకు విత్తన గిడ్డంగి

ASF: కౌటాల మండల కేంద్రంలో రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన విత్తన గిడ్డంగి అధికారుల పర్యవేక్షణ లేమితో శిథిలావస్థకు చేరింది. గిడ్డంగి పరిసరాల్లో చెత్తాచెదారం పేరుకుపోయి భారీ చెట్లు పెరిగి రైతులు వెళ్లకుండా తయారు అయింది. ఒకప్పుడు రైతులకు విత్తనాలు అందుబాటులో ఉంచేందుకు ఉపయోగపడిన గిడ్డంగి నేడు నిరుపయోగంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.