హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఎస్సీ హాస్టల్లో కనీస సౌకర్యాలు కరువు: BSP

SDPT: సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల అనుబంధం ఎస్సీ హాస్టల్లో కనీస సౌకర్యలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని సిద్దిపేట జిల్లా BSP అధ్యక్షుడు పుల్లూరి ఉమేష్ మండిపడ్డారు. సోమవారం ఆయన ఎస్సీ హాస్టల్‌ను సందర్శించారు. భోజనం సదుపాయం కూడా సరిగా లేదని, మరుగుదొడ్లు సరిగా లేవని అన్నారు. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు.