WGL: పర్వతగిరి మండలం ఏనుగల్లో వడ్డే అశ్వినికి మూడు ఎకరాల మెట్టభూమిని ఆమె వివాహ సమయంలో తల్లి సౌందర్య వరకట్నంగా బహుమతిగా ఇచ్చినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 2010 నుంచి బంధువులతో భూవివాదం కొనసాగుతోందని, పోలీసు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఇటీవల మళ్లీ హద్దురాళ్లు పాతడంతో మనస్తాపానికి గురైన అశ్విని పురుగుమందు తాగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
పురుగుమందు తాగి వివాహిత ఆత్మహత్యాయత్నం


