NRPT: దామరగిద్ద మండలంలోని కానుకుర్తి గ్రామానికి చెందిన సేలేటి నరేష్ గౌడ్ బీసీ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. బీసీల హక్కులు, సంక్షేమం, సామాజిక న్యాయం కోసం కృషి చేస్తున్న తన సేవలను గుర్తించి సంఘం వ్యవస్థాపక సభ్యులు ఆర్. కృష్ణయ్య బాధ్యతను అప్పగించినట్లు నరేష్ తెలిపారు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులతో పాటు మండలంలో పలువురు అభినందించారు.
తెలంగాణ
బీసీ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శిగా కానుకుర్తి వాసి


