హైదరాబాద్: 28°C
తెలంగాణ

పిడుగు పడి మూగ జీవాలు మృతి

BDK: పినపాక మండలం వెంకట్రావుపేట గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పొనగంటి రమేష్‌కు చెందిన ఎద్దులు మేతకు వెళ్లగా, వ్యవసాయ పొలంలో పిడుగు పడటంతో ఒక దుక్కిటెద్దు అక్కడికక్కడే మృతి చెందింది. మరో గ్రామం సీతాపురంలోనూ ఓ గేదె మృతి చెందింది. జీవనాధారమైన మూగజీవాలు మృతి చెందడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పశువైద్యాధికారికి సమాచారం అందించారు.