హైదరాబాద్: 28°C
తెలంగాణ

అల్వాల్ ఘటనపై సమగ్ర విచారణకు ఫిర్యాదు

MDCL: అల్వాల్‌లో భర్త భార్యను హత్య చేసిన దారుణ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని TRS నేతలు కోరారు. ఈ మేరకు మల్కాజ్‌గిరి పార్లమెంట్ ఇంఛార్జ్ వేముల భవాని, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు పడాల మనోజ గౌడ్ అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.