హైదరాబాద్: 28°C
తెలంగాణ

బౌద్ధనగర్‌లో పొంగుతున్న డ్రైనేజీ

HYD: బౌద్ధనగర్ రోడ్ నంబర్ 3లో పలు మ్యాన్‌హోళ్ల నుంచి మురుగు నీరు లీకవుతోంది. దీంతో రోడ్డుపై డ్రైనేజీ నీరు ప్రవహిస్తూ దుర్వాసన, అపరిశుభ్రతతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి మ్యాన్‌హోళ్ల లీకేజీలను అరికట్టాలని స్థానికులు కోరుకుంటున్నారు.