హైదరాబాద్: 28°C
తెలంగాణ

గులాబీ వర్ణంలో వినాయక స్వామి దర్శనం

SRD: పటాన్చెరు మండలం రుద్రారం శివారులోని గణేష్ గడ్డ ఆలయంలో మంగళవారం బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు సిద్ధి వినాయక స్వామి విశేషాలంకరణలో దర్శనమిచ్చారు. స్థానిక ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారికి విశేష అభిషేక పూజలు నిర్వహించి, గులాబీ వర్ణంలో సుగంధ పుష్పాలతో అలంకరించి మహా మంగళహారతి నైవేద్యం సమర్పించారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు.