హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాగు నుంచి వ్యక్తిని సురక్షితంగా తరలింపు

ప్రకాశం: పుల్లలచెరువు(M) నిన్న సాయంత్రం భారీ వర్షం కురిసింది. పుల్లలచెరువు- తెల్లగట్ల మధ్య వర్షపు నీరు ఉద్ధృతంగా ప్రవహించింది. వాగును దాటేందుకు ప్రయత్నించిన బైకు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. వాహనదారుడు సునీల్ కుమార్ నీటిలో చిక్కుకున్నాడు. సమాచారం అందుకున్న SI బి. సాంబశివరావు.. సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని వ్యక్తిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.