హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుంత పడి.. బురదతో నిండి..!

WNP: పెద్దమందడి మండలం ముందరి తండా రహదారిలో గుంత ఏర్పడి బురదతో నిండిపోయింది. నీరు నిల్వ ఉండడంతో గుంత వాహనదారులకు సమీపించే వరకు కనిపించడం లేదు. దీంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. వనపర్తి నుంచి ఘనపురం, పెద్దమందడి వైపు రాకపోకలు అధికంగా ఉండటంతో అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరారు.