హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కారు బోల్తా.. ఐదుగురుకి తీవ్ర గాయాలు

BPT: చీరాల నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఐదుగురు ప్రయాణికులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం పెద్దనెమలిపూరి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున వారి కారు అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. స్థానికులు వారిని సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించగా, ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.