హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: దివ్య మంగళ రూపంలో దర్శనమిచ్చిన వనదుర్గా మాత

MDK: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీఏడుపాయల వనదుర్గా భవాని ఆలయంలో మంగళవారం అమ్మవారు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు స్వామి, అమ్మవార్లకు వేకువజామునే ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. రంగురంగుల పుష్ప శోభితమైన అమ్మవారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.