హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'

KDP: గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని AITUC బద్వేల్ ఏరియా ప్రధాన కార్యదర్శి ఇర్ల నాగేశ్ డిమాండ్ చేశారు. బద్వేలులో ఆయన మాట్లాడుతూ.. కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించడంతోపాటు సబ్బులు, మాస్కులు, పనిముట్లు అందించాలని కోరారు. PF, ESI, తదితర సంక్షేమ సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.