JN: జనగామ మున్సిపాలిటీ పరిధిలో స్వచ్ఛతకు సహకరించాలని మున్సిపల్ అధికారులు సూచిస్తున్నా కొందరు పట్టించుకోవడం లేదు. ప్రధాన కూడళ్లలో చెత్త వేయరాదని సూచిక బోర్డులు ఏర్పాటు చేసినా, వాటి పక్కనే చెత్త వేస్తున్నారు. మంగళవారం జనగామ పోలీస్‌స్టేషన్ సమీపంలోని కూడలి చెత్తతో అపరిశుభ్రంగా మారింది. అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
'చెత్త వేయరాదు'.. అయినా పట్టించుకోని ప్రజలు


