హైదరాబాద్: 28°C
తెలంగాణ

భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు

WGL: వరంగల్ నగరంలోని చారిత్రక శ్రీ భద్రకాళి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు, విశేషాభిషేకాలు చేశారు. తెల్లవారుజామున అర్చకులు సంప్రదాయబద్ధంగా పూజలు చేసి అమ్మవారికి నూతన వస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక అలంకరణలో అమ్మవారిని భక్తులకు దర్శనమిచ్చేలా తీర్చిదిద్దారు. అమ్మవారి దర్శనం కోసం నగరంతోపాటు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.