BPT: వినాయక విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్తున్న సమయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్లు ఎస్సై కిషోర్‌బాబు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఆదివారం రాత్రి ఊరేగింపు సందర్భంగా పెసర్లంక, గాజుల్లంకకు చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కొల్లూరు లాక్ సెంటర్ వద్ద కర్రలతో పరస్పరం దాడి చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
ఘర్షణకు సంబంధించి కేసులు నమోదు: SI


