PDPL: ఓదెల, మండలం పోత్కపల్లిలోని రెడ్డి గణేష్ మండపంలో ముస్లిం సోదరుడు ఎండీ జలీలుద్దీన్ మతసామరస్యాన్ని చాటారు. గణేష్ నవరాత్రుల తొలిరోజు అన్నదానం నిర్వహించారు. సౌదీ అరేబియాకు వెళ్లే ముందు వినాయకుడికి అన్నదానం చేయాలన్న సంకల్పంతో చేపట్టినట్లు తెలిపారు. ప్రతి ఏటా తొలిరోజు అన్నదానం చేయడం సంతోషంగా ఉందని, మానవత్వమే గొప్పదని నిరూపించారు.
తెలంగాణ
మానవత్వమే గొప్పదని చాటిన ముస్లిం సోదరుడు


