హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కళ్లు కదుపుతూ.. కనువిందు చేస్తున్న గణనాథుడు

ASR: సీతమ్మధార ఆర్అండ్ క్వార్టర్స్‌లో యంగ్ బాయ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం ఆకట్టుకుంటోంది. మండపంలో కొలువుదీరిన గణనాథుడు కళ్లు తెరుస్తూ, మూసుకునేలా ప్రత్యేకంగా రూపొందించారు. దీంతో స్వామివారు నిజంగానే తమవైపు చూస్తూ కనుసైగ చేస్తున్న అనుభూతి భక్తులకు కలుగుతోంది. ఈ ప్రత్యేక విగ్రహాన్ని చూసేందుకు భక్తులు తరలివస్తున్నారు.