హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపాలిటీ వార్డు రిజర్వేషన్ల మీద ఉత్కంఠ!

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో వార్డుల రిజర్వేషన్ మీద ఉత్కంఠ నెలకొంది. గతంలో 28 వార్డులకు అత్యధిక శాతం బీసీలకు కేటాయించారు. ఎస్సీ సామాజిక వర్గానికి మూడు, ఎస్టి సామాజిక వర్గానికి ఒక వార్డు కేటాయించగా ఐదు వార్డులు జనరల్ కు కేటాయించారు. ఇప్పుడు 40 వార్డులకు పోటీ జరుగుతున్న నేపథ్యంలో రిజర్వేషన్ల కోసం ఆశావాహులు ఎదురు చూస్తున్నారు.