హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోడిపందాల స్థావరంపై పోలీసులు దాడి

E.G: సీతానగరం మండలం ఉండేశ్వరం గ్రామ శివారుణ కోడిపందాలు నిర్వహిస్తున్నట్లు పక్కా సమాచారం అందుకున్న ఎస్సై ఎల్ శ్రీనివాస్ నాయక్ తన సిబ్బందితో దాడి నిర్వహించారు. ఈ దాడిలో పదిమంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 5,200 ల నగదు, రెండు కోళ్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై శ్రీనివాస్ నాయక్ తెలిపారు.