హైదరాబాద్: 28°C
తెలంగాణ

తెగిపడిన వైర్లు.. తప్పిన ప్రమాదం

NZB: ఎడపల్లి మండల కేంద్రంలోని 5వ వార్డులో వినాయకచవితి పండుగ వేళ భారీ ప్రమాదం తప్పింది. గల్లీలో ఒక్కసారిగా విద్యుత్ వైర్లు తెగి కింద పడ్డాయి. విద్యుత్ సరఫరా తీగలు పడటంతో స్థానికులు అప్రమత్తమై విద్యుత్ అధికారులకు సమాచారం అందించడంతో పెనుముప్పు తప్పింది. గతంలోనూ ఇక్కడ చైనా మాంజా వల్ల వైర్లు తెగిపడిన ఘటనలు ఉన్నాయి.