హైదరాబాద్: 28°C
తెలంగాణ

మండపాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు: ఎస్పీ

NLG: నిన్నటి నుంచి మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎస్పీ శరత్‌చంద్ర పవార్ జిల్లా ప్రజలకు పలు సూచనలు ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ఉత్సవాల నిర్వహణకు ఇప్పటి వరకు 2,500 మంది విగ్రహ నిర్వహకులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నట్లు తెలిపారు. మండపాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన అన్నారు. ప్రజలు పండగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు.