హైదరాబాద్: 28°C
తెలంగాణ

మూసీ రిజర్వాయర్‌లో పెరుగుతున్న వరద నీరు!

NLG: నల్గొండ మండలంలోని మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మంగళవారం తెల్లవారుజాము నాటికి ఇన్‌ఫ్లో 2,566.87 క్యూసెక్కులుగా నమోదైనట్లు ప్రాజెక్టు అధికారి మధు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 639.10 అడుగులకు చేరగా, నీటి నిల్వ 3.06 టీఎంసీలుగా ఉందని ఆయన తెలియజేశారు.