SDPT: రాయపోల్ మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామ చెరువు వర్షాలకు అలుగు పోస్తోంది. చెరువు నీరు ఉధృతంగా రోడ్డుపైకి చేరడంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. బాటసారులు, వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అత్యవసర పనులపై వెళ్లేవారు సైతం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. నీటి ప్రవాహం మరింత పెరిగితే ప్రమాదాలు జరుగుతాయని గ్రామస్థులు పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: ఉధృతంగా కొత్తపల్లి అలుగు


