హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బెట్టింగ్‌ యాప్‌తో మోసపోయానని ఫిర్యాదు

NTR: బ్రహీంపట్నంకు చెందిన శివ క్యూవీఎస్‌ఈ బెట్టింగ్ యాప్‌లో రూ.50 వేల పెట్టుబడి పెట్టి మోసపోయినట్లు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తొలుత యాప్‌లో డాలర్లు కనిపించగా, ఆ తర్వాత యాప్ ఓపెన్ కాలేదని తెలిపాడు. సీఐ సుబ్రహ్మణ్యం విచారణలో పలువురు విద్యుత్తు ఉద్యోగులు కూడా యాప్‌లో సభ్యులుగా ఉన్నట్లు గుర్తించారు.