హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వాగుపై బ్రిడ్జి నిర్మించండి.. నరకం చూస్తున్నాం'

ఖమ్మం: కరకగూడెం మండలం కొత్తగూడెం-కొమరం వారి గుంపు గ్రామాల మధ్య ఉన్న వాగు ఉధృతి వల్ల నిత్య రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షకాలంలో ఈ వాగు పొంగడం ద్వారా పొలం పనులకు, పాఠశాలలకు వెళ్లే వారికి నిత్యం నరకం కనిపిస్తోందని వివరిస్తున్నారు. వాగుపై వెంటనే బ్రిడ్జి నిర్మాణం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.