హైదరాబాద్: 28°C
తెలంగాణ

కమలాపూర్‌లో కుక్కల స్వైర విహారం.. ప్రజల బెంబేలు

HNK: కమలాపూర్ మండల కేంద్రంలో వీధి కుక్కల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై వెళ్తున్న వాహనదారులను కుక్కలు వెంబడిస్తూ దాడులకు పాల్పడుతున్నాయని స్థానికులు మంగళవారం తెలిపారు. రాత్రివేళ గుంపులుగా తిరుగుతుండటంతో భయాందోళన నెలకొంది. చిన్నారులు, వృద్ధుల భద్రత దృష్ట్యా అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.