హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉరుకుందలో 21 బైకుల చోరీ.. ముగ్గురు అరెస్టు

KRNL: ఉరుకుంద క్షేత్రంలో శ్రావణమాసంలో భక్తుల బైకులు చోరీ చేసిన ముగ్గురు నిందితులను కౌతాళం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 21 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 20 లక్షలుగా పోలీసులు తెలిపారు. నంబర్లు మార్చి విక్రయించేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించారు.