JN: జనగామ వీవర్స్ కాలనీకి చెందిన మామిడ్ల పద్మకు రూ.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. గతంలో అప్పు చేసి బేస్మెంట్ నిర్మించినా సాంకేతిక కారణాలతో పోర్టల్‌లో నమోదు కాకపోవడంతో కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అర్హతను ధ్రువీకరించి మంజూరు చేశారు. ఆయన ఆదేశాల మేరకు సోమవారం మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్‌రెడ్డి పద్మ ఇంటికి వెళ్లి మంజూరు ప్రొసీడింగ్స్ అందజేశారు.
తెలంగాణ
పేద కుటుంబానికి అండగా కలెక్టర్.. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు


