హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పదవీకాలం ముగింపు.. కొత్త అడుగులపై చర్చ

GNTR: గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ కత్తెర హెన్రీ క్రిస్టీనా పదవీకాలం త్వరలో ముగియనుంది. దీంతో కత్తెర దంపతుల తదుపరి రాజకీయ అడుగులపై చర్చ జరుగుతోంది. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారికి దక్కే ప్రాధాన్యం, తాడికొండ సీటుపై పార్టీ నిర్ణయం కోసం వారు ఎదురుచూస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గాల పెంపు జరిగితే పరిస్థితులు అనుకూలిస్తాయని భావిస్తున్నట్లు తెలుస్తుంది.